ప్రధాని మోడీపై అసభ్యకర కామెంట్..వ్యక్తిపై దేశద్రోహం కేసు..!

సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీపై అసభ్యకర కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీ పోలీసుల కథనం ప్రకారం..ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఫేస్ బుక్ లో వివాదాస్పద కామెంట్స్ పెట్టాడు. ఈ కామెంట్స్ పై కొందరు యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసులు ఆ వ్యక్తి ఫేస్ బుక్ ఖాతా వివరాలను సేకరించారు. ఆ వ్యక్తి ఒడిశాలోని కుసుంభీ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇక యూపీ పోలీసులు ఒడిశా పోలీసుల సహకారంతో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 124ఏ కింద దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. ఇక సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.  

You might also like
Leave A Reply

Your email address will not be published.