ఏటీఎం వినియోగదారుల కోసం ఎస్బీఐ కొత్త ఫీచర్..!

తన కస్టమర్ల భద్రత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఏటీఎంలో బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ చెక్ చేసిన ప్రతిసారి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓ మెసేజ్ పంపడం ద్వారా కస్టమర్లను అప్రమత్తం చేయనుంది. ఏటీఎం మోసాలను అరికట్టడానికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుందని, కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ హెచ్చరించింది.  

ఒకవేళ అనధికార లావాదేవీ జరుగుతున్నట్లు మెసేజ్ అలర్ట్ వస్తే ఖాతాదారుడు వెంటనే తన ఏటీఎం కార్డును బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ కు సంబధించిన సమాచారాన్ని ఎస్బీఐ తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. బ్యాలన్స్, మినీ స్టేట్మెంట్ ఎంక్వైరీలకు సంబంధించి మెసేజ్ అలర్ట్ లను నిర్లక్ష్యం చేయవద్దని సూచించింది. 

Leave a Comment