పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన ఎన్టీఆర్..!

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇంత వరకు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడలేదు. తాజాగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. కాగా, ఎన్టీఆర్ హోస్ట్ గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే కార్యక్రమం త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో శనివారం విడుదలైంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. 

ఈ సమావేశంలో పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ ను విలేకరులు ప్రశ్నించారు. మీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడని అడిగారు. దీనిపై ఎన్టీఆర్ మాట్లాడుతూ మీరు ఈ ప్రశ్న చాలా సార్లు అడిగారని, కానీ రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఇది సమయం, సందర్భంగా కాదని అన్నారు. దీని గురించి మరొసారి చర్చించుకుందామని సమాధానం ఇచ్చారు.   

Leave a Comment