ధోనీ కొత్త అవతారం..!

చెన్నై సూపర్ కింగ్స్ సారథి, టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుతం ప్రస్తుతం చెన్నైలోని సీఎస్కే క్యాంప్ లో సహచర క్రికెటర్లతో సాధన చేస్తున్నాడు. నెట్స్ లో బౌలర్లపై విరుచుకుపడుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ధీనికి భిన్నంగా స్టార్ స్పోర్ట్స్ ధోనీ న్యూ లుక్ ను తమ అధికార ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. 

ధోని కొత్త అవతార్ గురించి మీరు ఏమనుకుంటున్నారని క్యాప్షన్ క్యాప్షన్ ను జత చేసింది. కాగా గుండుతో సన్యాసి వలే ఉన్న ధోని ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్ స్పోర్ట్స్ ఒక వీడియోను కూడా అప్ లోడ్ చేసింది. అందులో ధోని ‘క్యా హై ఇస్ అవతార్ కే పీఛే.. జల్దీ హీ పతా చలేగా’ అంటూ చెబుతున్నాడు. అంటే ఈ అవతారం వెనుక ఏ మంత్రం ఉందో త్వరలో తెలిసిపోతుంది.. అని అంటున్నాడు. అయితే ఈ అవతారం వెనుక వివరాలు ఇంకా వెల్లడికాలేదు.   

Leave a Comment