ఇక్కడే ఆపేయండి.. చంద్రబాబుకు జరిగిన అవమానంపై ఎన్టీఆర్ ఆగ్రహం..!

ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జరిగిన అవమానంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడడం అరాచక పాలనకు నాంది పలుకుతుందని జూనియర్ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే.. 

‘మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం.. అవి ప్రజా సమస్యలప జరగాలే కానీ, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలుగా ఉండకూడదు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచి వేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి.. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది అరాచక పాలనకు నాంది పలుకుతుంది.’

‘స్త్రీజాతిని గౌరవించడం అనేది మన సంస్కృతి, మన నవనాడుల్లో, మన జవ జీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం.. దాన్ని రాబోయే తరలకు జాగ్రత్తగా అప్పగించాలి. ఈ మాట ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఈ దేశానికి చెందిన ఒక పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులకు ఒక విన్నపం.. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడే ఆపేయండి. ప్రజాసమస్యలపై పోరాడండి.’ అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.   

Leave a Comment