చంద్రబాబుకు జరిగిన అవమానంపై ఆవేదనతో.. ఉద్యోగానికి రాజీనామా చేసిన కానిస్టేబుల్.. వీడియో వైరల్..!

ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు తన భార్య గురించి అసభ్యంగా వ్యాఖ్యానించారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర మనస్తాపాకి గురయ్యారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక మీడియా సమావేశంలో బోరును విలపించారు. ఈ ఘటనతో తీవ్రంగా చలించిపోయిన చంద్రబాబు.. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తానంటూ శపథం చేశారు.. 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పట్ల అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును అందరూ విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు అసెంబ్లీలో జరిగిన అవమానంపై ప్రకాశం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ కె.విజయకృష్ణ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తనకు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంటూ ఓ వీడియో విడుదల చేశాడు.  1998 బ్యాచ్ లో సివిల్ కానిస్టేబుల్ గా ప్రకాశం జిల్లా టాపర్ గా నిలిచానని, విధి నిర్వహణలో ఎంతో నిజాయితీగా పని చేశానని విజయకృష్ణ తెలిపాడు. ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పాడు.

‘ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు పోలీసులకు తెలుసు. అసెంబ్లీలో ప్రభుత్వం నైతిక విలువలు, నిబద్ధత కోల్పోయింది. ఇలాంటి వారి వద్ద ఉద్యోగం చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నాను. వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్థ దారుణంగా తయారైంది. నియమ, నిబద్ధత లేని ప్రభుత్వం ముందు మోకరిల్లే పోలీసు ఉద్యోగం నాకు వద్దు.. అందుకే ప్రజల ముందు నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను’ అంటూ విజయకృష్ణ తన టోపీ, బెల్ట్ ని తీసేశారు.. విజయకృష్ణ ఎంతో ఆవేదనతో చేసిన ఈ వీడియో అందరినీ కదిలిస్తోంది..  

Leave a Comment