భారత్ లో ‘గూగుల్ పే’ నిషేధంపై క్లారిటీ..!

ఇండియాలో గూగుల్ పే ను ఆర్బీఐ నిషేధించిందని వస్తున్న వార్తలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) క్లారిటీ ఇచ్చింది. గూగుల్ పేను ఇండియాలో నిషేధించడం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో గూగుల్ పేను ఆర్బీఐ బ్యాన్ అని వస్తున్న పుకార్లను NPCI కొట్టిపారేసింది. గూగుల్ పే సురక్షితం అని ప్రకటించింది. 

NPCI అనేది భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను నిర్వహించే ఒక సంస్థ. ఈ సంస్థ గూగుల్ పే, ఫోన్ పే మరియు పేటిఎం వంటి ప్లాట్ పారంల ద్వారా చెల్లింపుల కోసం ఉపయోగించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ)ను అభివృద్ధి చేసింది. గూగుల్ పేను పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ గా ఆర్బీఐ అధికారం ఇచ్చిందని NPCI స్పష్టం చేసింది. 

అయితే గూగుల్ పే థర్డ్ పార్టీ ప్రొవైడర్ మాత్రమేనని, ఇది ఎలాంటి పేమెంట్ వ్యవస్థను నిర్వహించదని ఆర్బీఐ ఢిల్లీ హైకోర్డుకు తెలిపింది. NPCI ప్రచురించిన అథీకృత చెల్లింపు వ్యవస్థల ఆపరేటర్ల జాబితాలో లేదని, ఇది చట్టాన్ని ఉల్లంఘించలేదని ఆర్బీఐ కోర్టుకు తెలిపింది. 

Leave a Comment