అద్భుతం : సూర్యుడి పదేళ్ల టైమ్ లాప్స్ వీడియో..

సూర్యుని యొక్క అద్భుత వీడియోను నాసా విడుదల చేసింది. పది సంవత్సరాలలో సూర్యునిలో చోటుచేసుకున్న మార్పులకు సంబంధించి ఫొటోలను ఒక గంటకు కుదించి వీడియోను రూపొందించింది. నాసా యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ పదేళ్లలో దాదాపు 425 మిలియన్ల హై రిజల్యూషన్ చిత్రాలను తీసింది.

ఈ ఎస్డీఓ ప్రతి 0.75 సెకండ్ కు ఒకసారి సూర్యూడి ఫొటో తీస్తుంది.  ప్రతి 12 సెకండ్లకు ఒకసారి ఆ ఫొటోలు నాసాకు చెందిన అట్మాస్మెరిక్ ఇమేజింగ్ అసెంబ్లీకి చేరుతాయి. ఈ వీడియోలో సూర్యడిపై భారీ మంటలు, సూర్యకంపాలు, సౌరగాలులు ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఈ వీడియో చూస్తున్నప్పుడు 12.24 నిమిషాల వద్ద సూర్యుడి ముందు నుంచి శుక్రగ్రహం వెళ్లడాన్ని చూడొచ్చు. 1.08 నిమిషాల వద్ద సూర్యకంపం, 2.17 నిమిషాల వద్ద పాక్షిక సూర్యగ్రహణం చూడవచ్చు. ఈ పదేళ్లలో సూర్యడిపై మంటలు పెరగడం గమనించవచ్చు. 

ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మరియు నెటిజన్ల నుంచి ప్రశంసలు పొందుతోంది. ఇప్పటి వరకు 6.7 లక్షల వ్యూస్, 7,800 లైక్స్, 450 కామెంట్లు వచ్చాయి. 

Leave a Comment