కేబుల్ కనెక్షన్ ఉన్న వారికి గుడ్ న్యూస్  

కేబుల్ లేదా డీటీహెచ్ వినియోగదారులకు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) గుడ్ న్యూస్ అందించింది. మీ కేబుల్ లేదా డీటీహెచ్ బిల్లులను తగ్గించేందుకు TRAI Channel Selector appను ప్రారంభించింది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో అందుబాటులో ఉంది.

ఈ యాప్ ద్వారా మీరు మీ కేబుల్ టీవీ లేదా డీటీహెచ్ లో ఛానెళ్లను ఆపరేట్ చేసుకోవచ్చు.  మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానెళ్లకు ఎంత బిల్ అవుతుందో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. టాటా స్కై, ఎయిర్ టెల్, డిజిటల్ టీవీ, డిష్ టీవీ, డీ2హెచ్, హాత్ వే డిజిటల్, సిటీ నెట్వర్క్, ఏషియానెట్, ఇన్ డిజిటల్ వంటి డీటీహెచ్ ఆపరేటర్లు మరియు కేబుల్ టీవీ ఎంఎస్ఓలకు సంబంధించిన అన్ని వివరాలు ఈ యాప్ లో ఉంటాయి. 

ఈ యాప్ ఎలా ఉపయోగించాలి?

  • ముందుగా మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్లో TRAI Channel Selector app డౌన్ లోడ్ చేయాలి. 
  • యాప్ ఓపెన్ చేసి మీ కేబుల్ లేదా డీటీహెచ్ ఆపరేటర్ ను సెలెక్ట్ చేయాలి. 
  • మీ సబ్ స్క్రిప్షన్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 
  • మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. 
  • తర్వాత మీ కేబుల్ టీవీ లేదా డీటీహెచ్ ఛానెల్ ప్యాక్స్ ను మార్చుకోవచ్చు. 
  • ఇందులో ప్రస్తుత సబ్ స్క్రిప్షన్ వివరాలు కూడా ఉంటాయి. ఇందులో ఉన్న చానెళ్లు జాబితాలో మరిన్ని ఛానెళ్లను చేర్చుకోవచ్చు. 

Leave a Comment