తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.. త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు..

తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. పోలీస్ శాఖ, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆదేశించారు. అవే కాకుండా ఇతర విభాగాల్లో ఖాళీల ఆధారంగా మరికొన్ని నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని, వాటిని భర్తి చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కేసీఆర్ ఆదేశించారు. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉందని, ఈ రెండు విభాగాలతో పాటు ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు సేకరించాలన్నారు. ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆదేశించారు. 

 

Leave a Comment