షాకింగ్ : విజయవాడ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులు నీళ్లు..!

విజయవాడలోని ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులు నీళ్లు వచ్చాయి. బంకు లో పెట్రోల్ కొట్టించిన వాహనదారుల వాహనాలు ఆగిపోవడంతో వారు తిప్పలు పడాల్సి వచ్చింది. మెకానిక్ వద్దకు తీసుకెళ్లగా, వారు పరీక్షించి పెట్రోల్ కి బదులు నీళ్లు ఉన్నాయి. దీన్ని చూసిన వాహనదారులు షాక్ కిి గురయ్యారు. 

దీంతో వాహనదారులు నగరంలోని ఆటోనగర్ అరుణ శ్రీ పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే తాము పెట్రోల్ లో ఎలాంటి నీటిని కలపలేదని, కంపెనీ నుంచి వచ్చిన పెట్రోల్ నేరుగా ట్యాంకర్ లో నింపామని బంకు యజమానులు చెబుతున్నారు. దానిని పరీక్షించి చూడగా పెట్రోల్ లో కలిపే ఇథనాల్ కలపాల్సిన శాతం కంటే ఎక్కువగా కలిసిందన్నారు. 

వెంటనే కంపెనీ అధికారులకు సమాచారం అందించామని, ఆగిపోయిన 25 వాహనాలను వెంటనే రిపేర్ చేయించామని తెలిపారు. కాగా, అధిక శాతం ఇథనాల్ కలవడం వలనే వాహనాలు ఆగిపోవడానికి కారణమని ఆటోమొబైల్ నిపుణులు అంటున్నారు. పెట్రోల్ లో వాటర్ కలవడం సాధ్యం కాదని, ఒకవేళ కలపడానికి ప్రయత్నించిన ఇట్టే పసిగట్టవచ్చని చెబుతున్నారు.  

 

Leave a Comment