ఏపీలో రెండు సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలి : బీజేపీ ఎంపీ

తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రయిక్ చేస్తే, ఏపీలో రెండు సర్జికల్ స్ట్రయిక్ చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలీస్ స్టేషన్లలో క్రిస్మస్ వేడుకలు జరపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని, పోలీస్ స్టేషన్లే వేదికగా మత ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లో దసరా సంబరాలు ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. 

వైసీసీ, టీడీపీ రెండు మతతత్వ పార్టీలేనని వ్యాఖ్యానించారు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసే మత రాజకీయాలపై ప్రజలే రెండు సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తారని పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి పోటీ చేస్తుందని వెల్లడించారు. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యలో కూడా ముస్లిం ఓట్ల కోసం పోలీసులను వేధించారని జీవీఎల్ వ్యాఖ్యానించారు.  

 

Leave a Comment