కరోనా వచ్చిన తర్వాత మీకు నిద్ర రావడం లేదా? అయితే ఇది తెలుసుకోండి..

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా మనం భయాందోళనలకు, తీవ్రమైన ఉద్వేగానికి లోనైనప్పుడు దాని ప్రభావం మొదటగా పడేది నిద్రమీదే.. నిద్ర అనేది మన సాధారణ ఆరోగ్యానికి, వ్యాధి నిరోధకత సక్రమంగా పనిచేయడానికి అవసరమన్నది తెలిసిందే.. అయితే కరోనా సోకి కోలుకున్న కొందరిలో నిద్ర పట్టడం ఓ సమస్యగా మారింది. ఫలితంగా అంతరాయాలతో కూడిన కొద్దిపాటి నిద్ర లేదా నిద్రలేమి పీడిస్తోంది.

నిద్ర రావాలంటే ఏంచేయాలి?

  • నిద్ర పట్టినా లేకపోయినా రోజూ మీ నిర్ణీతమైన నిద్రవేళకు పక్క మీదికి చేరండి. పక్క వెళ్లే సమయానికి ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడండి. 
  • సరిగ్గా నిద్ర సమయానికి బాగా కడుపునిండుగా ఉండేలా భోజనం చేయకండి. రాత్రి ఒకింత తేలికపాటి ఆహారమే మేలు. రాత్రి భోజనానికి, నిద్రకూ కాస్తంత వ్యవధి ఉండేలా జాగ్రత్త పడండి.
  • నిద్రకు ముందర శరీరానికి ఒకింత ఎక్కువ శ్రమ కలిగించే ఎలాంటి వ్యాయామాలు చేయకండి. నిద్రవేళకు చాలా ముందుగా తేలికపాటి వ్యాయామాలు మాత్రమే చేయండి. 
  • ఒకసారి పడకమీదకు చేరాక ఎంతగా నిద్రపట్టకపోయినా మొబైల్, కంప్యూర్, టీవీ వంటి వాటికి దూరంగా ఉండండి. మీ పడకగదిలో ఆఫీసు పనిని తీసుకురాకండి..

Leave a Comment