ఏపీలో పాఠశాలలకు సెలవులు ఇచ్చే ప్రసక్తే లేదు..!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విస్తృతం అవుతోంది. విద్యాలయాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. యథాతథంగా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని వెల్లడించింది. 

అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పాఠశాలలకు సెలవులు ఇచ్చే ప్రసక్తే లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపషథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహించమని, దీని వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశారు. 

పాఠశాలల్లో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అదే విధంగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.  

Leave a Comment