షటిల్ ఆడుతూ కుప్పకూలిన సీఐ.. గుండెపోటుతో మృతి..!

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షటిల్ ఆడుతూ ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్ గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశాడు. జిల్లాలోని గణపవరం సీఐగా పనిచేస్తున్న డేగా భగవాన్ ప్రసాద్(42)కు ప్రతి రోజూ షటిల్ ఆడటం అలవాటు. రోజూలాగే గణపవరం పోలీస్ స్టేషన్ సమీపంలో షటిల్ ఆడెందుకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆయన షటిల్ ఆడుతూ కుప్పకూలిపోయారు. 

వెంటనే అప్రమత్తమైన తోటి క్రీడాకారులు ఆయనను పైకి లేపేందు ప్రయత్నించారు. అప్పటికే ఆయన నిర్జీవంగా పడిపోయారు. సీఐని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భగవాన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భగవాన్ గుండెపోటుతో మరణించినట్లు అనుమానిస్తున్నారు. సీఐ షటిల్ ఆడుతూ కుప్పకూలడం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. 

Leave a Comment