6 నెలలు ఎన్నికలు వద్దు..!

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా ఆరు నెలల పాటు ఎన్నికలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఏపీలో నాలుగు జిల్లాల్లో 70 శాతం కేసులు నమోదయ్యాయని, ఆ జిల్లాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని తెలిపారు. 

వైసీపీ ఎమ్మెల్యే లు, మంత్రులు లాక్ డౌన్ నిబంధనలు పట్టించుకోవడం లేదన్నారు. హెల్త్ బులెటిన్ లో కూడా అనేక లోపాలు ఉంటున్నా.. సరి దిద్దుకోవడం లేదని విమర్శించారు. పవిత్రమైన రంజాన్ మాసంలో దాతలు  భోజనం  పంపిణీ చేసేందుకు అవకాశం ఇచ్చారని, దానిపై పునరాలోచన చేయాలని సూచించారు. ఎపి జాలర్లను కాపాడేందుకు గుజరాత్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమన్నారు.

రైతుకు ఎకరాకు రూ. 25 వేలు సాయం‌ అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇతర రాష్ట్రాలలో పంటలు విక్రయించే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా విధుల్లో పాల్గొంటున్న  జర్నలిస్టు లకు యాభై లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. 

Leave a Comment