జూన్ 30 బహిరంగ సమావేశాలు రద్దు..

ఉత్తర ప్రదేశ్ లో జూన్ 30 వరకు బహిరంగ సభలు అనుమతించబడవని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడానికి 11 కమిటీల అధ్యక్షులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగీ మాట్లాడుతూ రాజకీయ ర్యాలీలు, సామాజిక కార్యక్రమాల వంటి పెద్ద సమావేశాల వల్ల కరోనా వైరస్ పెరిగే అవకాశాలు ఉన్నాయని, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

సామాజిక దూరం నిబంధనల ఉల్లంఘనపై గతంలో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసిందని, పెద్ద సమావేశాల గురించి జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాను కోరిందని చెప్పారు. జూన్ 30 వరకు ఎటువంటి సమావేశాలు నిర్వహించవద్దని అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. 

యూపీలో ఇప్పటి వరకు 1,600పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 25 మంది మరణించారు. అలాగే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 24,000 దాటగా 775 మంది మరణించారు. 

 

Leave a Comment