తీరం దాటిన ‘నివర్’ తుఫాన్..!

తమిళనాడు – పుదుచ్చేరి మధ్య, పుదుచ్చేరి దగ్గర లో ఏర్పడిన నివర్ తుఫాన్ తీర ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ తుఫాన్  బుధవారం రాత్రి 11:30 నంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తీరం దాటింది. ఈ సమయంలో నివర్ అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా బలహీన పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు పేర్కొన్నారు. 

తీరందాటిన నివర్ తుఫాన్ తన ప్రభావం చూపనుంది. తుఫాన్ ప్రభావంతో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. దీని ప్రభావంతో గురువారం చిత్తూరు, కర్నూల, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.  

మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రభావిత ప్రాంత  ప్రజలు  తప్పనిసరిగా వీలైనంత  వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది. ఇల్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పింది. రైతులు అప్రమత్తంగా ఉండి , పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావారణ శాఖ పేర్కొంది. 

 

Leave a Comment