అక్కడ అత్యాచారం చేస్తే.. నపుంసకత్వమే..!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యాచారాలు పెరిగిపోయాయి. చిన్నారులు, యువతులు, వృద్ధులు అనే తేడా లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి లైంగిక పటుత్వం తగ్గేలా ఆపరేషన్లు నిర్వహించాలని నిర్ణయించింది.

అంతేకాదు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ కాన్ ఆమోదం తెలిపారు. అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ పేరుతో న్యాయ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదా ఫెడరల్ కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టగా అందుకు ఆమోదం తెలిపింది. లైంగిక వేధింపుల కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేసేలా, సాక్ష్యులకు రక్షణ కల్పించేలా నిబంధనలు చేర్చారు. అయితే దీని విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.  

Leave a Comment