సీఐ లాకర్ లో కట్టలు కట్టలుగా డబ్బులు..!

క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కామారెడ్డి సీఐ జగదీశ్ అరెస్ట్ అయి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే..జగదీశ్ కు సంబంధించి అక్రమాస్తుల చిట్టాను లాగే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. నిజామాబాద్ కంటేశ్వర్ యాక్సిస్ బ్యాంకులో జగదీశ్ కు సంబంధించిన లాకర్ ను ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు. 

లాకర్ లో రూ.34,40,000 నగదుతో పాటు 9 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను అధికారులు సీజ్ చేశారు. ఇంకా జగదీశ్ కు సంబంధించి ఆక్రమాస్తులను గుర్తించే  పనిలో లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణ చందర్ రావు తెలిపారు. బినామీ పేర్లతో పలు చోట్ల పెద్ద ఎత్తున భూములు కొన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

Leave a Comment