ఆర్జీవీని కుక్కతో పోల్చిన నిఖిల్..!

సెన్సెషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ గా మారాడు. వర్మ ఇప్పుడు పవన్ కళ్యాన్ ను టార్గెట్ చూస్తు ‘పవర్ స్టార్’ సినిమా చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశాడు. అయితే పవన్ కళ్యాన్ కు ఉన్న క్రేజే వేరు. ఆయనకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు బయటే కాకుండా ఇండస్ట్రీలోనూ ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే పవన్ కళ్యాన్ ను ఏ ఒక్క మాట అన్న ఫ్యాన్స్ కు నచ్చదు. తాజాగా పవన్ కళ్యాన్ ను టార్గెట్ చేయడం పై ఫ్యాన్స్ తో పాటు హీరో నిఖిల్ కు కూడా నచ్చలేదు. ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. వర్మను కుక్కతో పోల్చాడు. ‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా..ఆ మహాశిఖరం తల తిప్పి చూడదు..మీకు అర్థం అయిందిగా’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వర్మకు తిక్క కుదిరిందంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.  

Leave a Comment