హిజాబ్ పై నిఖత్ జరీన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.. నిఖత్ జరీన్ తాజాగా నేషనల్ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన హిజాబ్ వివాదంపై స్పందించారు. హిజాబ్ పై ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. 

హిజాబ్ అనేది పూర్తిగా వ్యక్తిగత విషయమని నిఖత్ జరీన్ పేర్కొన్నారు. హిజాబ్ ధరించడంపై కామెంట్స్ చేయడం తనకు ఇష్టం లేదని, తాను వ్యక్తిగతంగా హిజాబ్ ధరంచడాన్ని ఇష్టపడతానని వెల్లడించారు. హిజాబ్ విషయంలో తనకు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. దుస్తుల విషయంలో తనకు తన కుటుంబ సభ్యులు స్వేచ్ఛ ఇచ్చారన్నారు. తన గురించి ఎవరు ఏమనుకుంటారో అనే విషయాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించడమే తన లక్ష్యమని నిఖత్ జరీన్ తెలిపారు. 

Leave a Comment