జిల్లా పేరు మార్పు వివాదం.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు..!

కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తలకు దారితీశాయి. కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రిలిమనరీ నోటీస్ జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ కోనసీమ సాధన సమితి ఆందోళనలు చేపట్టింది. మంగళవారం కలెక్టరేట్ ముట్టడికీ పిలుపునిచ్చింది.

ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. కొంత మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. 

ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటికి కూడా నిప్పు పెట్టారు. ఇంట్లోకి దూసుకెళ్లి ఫర్నీచర్ ఫర్నీచర్ ధ్వంసం చేసి తగులబెట్టారు. ఇంటి ఆవరణలో ఉన్న మూడు కార్లకు నిప్పు పెట్టారు. ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఆందోళనకారులు మంత్రి ఇంటిపైకి వస్తున్నారన్న విషయం తెలిసీ.. మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు.    

Leave a Comment