మెగా డాటర్ నిహారిక పెళ్లికి ముహూర్తం ఫిక్స్..!

మెగాబ్రదర్ నాగబాబు కూతరు నిహారిక పెళ్లికి ముహూర్తం ఖరారైంది. గుంటూర్ రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో డిసెంబర్ 9న నిహారిక వివాహం జరగనుంది. ఈ విషయాన్ని చైతన్య తండ్రి ప్రభాకర్ రావు తెలిపారు. డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో చైతన్య, నిహారికల వివాహం జరగనుంది. 

కాగా ఈ ఏడాది ఆగస్టు 13న నిహారిక, చైతన్యల నిశ్చితార్థం హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. కొద్ది మంది కటుంబ సభ్యుల మధ్య ఈ నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి వీరి వివాహ తేదీ, వేదిక గురించి రకరకాల రూమర్లు చకర్లు కొట్టాయి. ఇప్పటికి వీరి పెళ్లికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9న రాత్రి 7.15 నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారు. వివాహాన్ని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ నగరంలోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ హోటల్ లో నిర్వహించనున్నారు.

 

Leave a Comment