సోనూసూద్ కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న ప్రజలు..!

ఆపదలో ఉన్న ఎంతో మందికి సహాయం చేసిన రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. కరోనా కాలంలో అనేక మంది వలస కార్మికులను తమ సొంత ప్రాంతాలకు తరలించారు. అంతే కాదు తమకు కష్టం ఉందని ఎవరైన చెబుతే చాలు వెంటనే స్పందించి నేనున్నానంటూ సాయం చేశాడు. దీంతో అనేక మంది తమ సమస్యలను సోనూసూద్ కు తెలుపుకుంటున్నారు. ఆయన ఎక్కడున్నా వెళ్లి సాయం చేయమని కోరుతున్నారు. ఎంత బిజీగా ఉన్నా.. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యలు విని పరిష్కరిస్తున్నాడు. 

తాజాగా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సోనూసూద్ ను కలిసేందుకు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ప్రజలు వచ్చారు. సోనూసూద్ వారిని కలిసి ఓపికగా సమస్యలను అడిగితెలుసుకున్నారు. ప్రస్తుతం కొంత మంది సోనూసూద్ ను కలిసి తమ సమస్యలు తెలుపుతున్న వీడియో వైరల్ అవుతోంది. 

ఈ వీడియోను రమేష్ బాల అనే వ్యక్తి ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు. చాలా మంది కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి సోనూసూద్ ను కలిసేందుకు వస్తున్నారని, ఆయన షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ఓపికతో వారి సమస్యలు విని పరిష్కరించారని పేర్కొన్నాడు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై సోనూసూద్ స్పందించారు. ప్రజలకు దగ్గరవడానికి ఆ దేవుడు కొన్ని సార్లు మీలాంటి వాళ్లను ఉత్ప్రేరకంగా ఎన్నుకుంటారని, మీ ప్రోత్సాహకరమైన మాటలకు ధన్యవాదాలు రమేష్ అని రీట్వీట్ చేశాడు.  

Leave a Comment