ఏపీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ.. 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఉచితం..!

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే అత్యవసర సేవలు, రవాణాకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. 

ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.. ఈనేపథ్యంలో సీఎం జగన్ ప్రభుత్వ ఖర్చుతోనే ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారందరికీ ఏపీ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనుంది. 

Leave a Comment