మోడీ భేటిని లైవ్ పెట్టిన కేజ్రీవాల్.. మోడీ గుస్సా.. కేజ్రీవాల్ క్షమాపణ..!

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఆక్సిజన్ తో పాటు టీకాల నిల్వలు నిండుకున్నాయి. పరిస్థితిపై సమీక్షించేందుకు ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. కరోనా గుప్పిట్లో కొట్టుమిట్టాడుతున్న 11 రాష్ట్రాలను గుర్తించారు. ఆ రాష్ట్రాల సీఎంలతో సమావేశానికి మోడీ సిద్ధమయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం.. వర్చువల్ భేటీ కొనసాగుతోంది. 

అందరూ తమతమ రాష్ట్రంలో నెలకొన్ని పరిస్థితులపై మోడీకి వివరిస్తున్నారు. ఎలాంటి సాయం కావాలో కూడా విన్నవించుకుంటున్నారు. మోడీ కూడా ఎంతో శ్రద్ధగా వింటూ ముఖ్యమైన పాయింట్లు నోట్ చేసుకుంటున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమస్య వివరించే సమయం వచ్చింది. ఆక్సిజన్ కొరతను మోడీ దృష్టికి తీసుకెళ్లారు. 

‘కరోనా మహమ్మారిపై పోరాడేందుకు జాతీయ ప్రణాళిక ఉంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ముందుకెళ్లవు’ అంటూ ఢిల్లీ సీఎం చెప్పారు. ఇంతలో మోడీకి కోపం వచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రవర్తనపై అసహనంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఎంత వరకు వెళ్లిందంటే.. ప్రధానికి కేజ్రీవాల్.. డజను సార్లు ‘సారీ సార్.. సారీ మోడీజీ.. సారీ సారీ’ అనే వరకు వెళ్లింది. 

కేజ్రీవాల్ సారీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ప్రధాని మోడీ నిర్వహించిన సమావేశాన్ని ‘ఆప్’ లైవ్ టెలికాస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మోడీ కేజ్రీవాల్ మాట్లాడుతున్న సమయంలో ఏం జరిగింది అని ప్రశ్నించారు. ‘ఇది మన సంప్రదాయానికి విరుద్ధం కాదా’ అని తెలపడంతో కేజ్రీవాల్ స్పందించి వెంటనే క్షమాపణలు చెప్పారు. 

ఈ సమావేశం గురించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సీఎం తెలిపారు. ఇకపై జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. అయితే వివాదంపై ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ సీఎం కార్యాలయం అధికారులు ఓ వివరణ ఇచ్చారు. ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని ఎలాంటి ఆదేశాలు లేవని, గతంలో చాలా సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు గుర్తు చేశారు. 

Leave a Comment