భారత్ లో కొత్త వైరస్ టమోటా ఫ్లూ..లాన్సెన్ జర్నల్ వార్నింగ్..!

భారత్ లో కొత్త వైరస్ టమోటా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని లాన్సెట్ జర్నల్ హెచ్చరించింది. చిన్నారుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. టమోటా ఫ్లూ వల్ల చేతులు, కాళ్లు, మూతిపై ఎర్రటి దద్దలు వస్తాయి. కేరళలోని కొల్లామ్ లో టమోటా ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 82 మంది చిన్నారులకు ఈ వైరస్ వ్యాపించింది. చిన్నారులంతా 5 ఏళ్లలోపు వారు కావడం విశేషం. 

టమోటా ఫ్లూ అనేది ఇంటెస్టయినల్ వైరస్ కారణంగా వస్తుంది. పెద్వారిలో చాలా అరుదుగా ఈ వ్యాధి కనిపిస్తుంది. అది కూడా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో వస్తుంది. ఈ వ్యాధి సోకితే కాళ్లు, చేతులు, నోటిపై ఎర్రగా, నొప్పితో కూడిన నీటి పొక్కుల్లా ఏర్పడతాయి. ఇవి క్రమంగా టమోటా సైజులో పెరుగుతాయి. కేరళతో పాటు ఒడిశాలోనూ టమోటా ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి.  

టమోటా ఫ్లూ లక్షణాలు:

  • టమోటా ఫ్లూ వచ్చిన వారిలో తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పెయిన్స్, అలసట, నీరసం ఉంటాయి. 
  • కొంత మంది రోగుల్లో నాసియా, వాంతులు, డయేరియా, జ్వరం, డీ హైడ్రేషన్, జాయింట్లలో నొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి.  

Leave a Comment