హీరోయిన్ గా రోజా కూతురు?.. ఆ హీరో సరసన..!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న రోజా ఇప్పుడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సీఎం జగన కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. సాధారణంగా సినీ రంగంలో వారసులు ఎంట్రీ ఇవ్వడం కామన్.. ఇప్పుడు మంత్రి రోజా కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది..అది కూడా ఓ సినీ వారసుడు నటించనున్న సినిమా ద్వారా హీరోయిన్ గా అరంగేట్రం చేయనుందని వార్తలు వస్తున్నాయి.. 

రోజా కూతురు అన్షు మాలిక ఎప్పటి నుంచో సినిమాల్లోకి రాబోతోందని ప్రచారం జరుగుతూ వస్తోంది.. కానీ ఈ విషయం మీద రోజా క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా అన్షు మాలిక ఓ సినీ వారుడు నటించనున్న మూవీలో హీరోయిన్ గా అరంగేట్రం చేయించడానికి రోజా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.. రోజా తన కూతురుకు యూఎస్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో ట్రైనింగ్ ఇప్పిస్తోందని, త్వరలోనూ అన్షుమాలిక అక్కడ జాయిన్ కానుందని వార్తలు వస్తున్నాయి. 

ఈ మధ్య తన 19వ పుట్టినరోజు జరుపుకున్న అన్షు మాలిక రచయితగా ఇప్పటికే పలు పుస్తకాలు రచించి పలు అవార్డులు కూడా అందుకుంది. అయితే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా అంటే దానికి ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. ఆమె సినిమాల్లో వస్తారో లేదో అన్న విషయం మీద మంత్రి రోజా మాత్రమే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 

 

 

Leave a Comment