కవలలకు జన్మనిచ్చిన నటి నమిత..!

హీరోయిన్ నమిత కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నమిత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. చెన్నై సమీపంలోని ఓ ఆస్పత్రిలో ఇద్దరు మగ బిడ్డలకు జన్మినిచ్చినట్లు తెలిపారు. తామంతా ఆరోగ్యంగా ఉన్నాని చెప్పారు. క్రిష్ణాష్టమి రోజున ఈ గుడ్ న్యూస్ మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. అభిమానుల ఆశీర్వాదాలు, ప్రేమ తమపై ఎల్లపుడు ఉండాలని కోరారు.

ఇక తాను ప్రసవించిన ఆస్పత్రి యాజమాన్యానికి, గర్భం దాల్చినప్పటి నుంచి వైద్య పరమైన సలహాలు, సూచనలు అందించిన వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కవలలను ఎత్తుకొని భర్తతో ఉన్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. కాగా, 2017లో ప్రియుడు వీరేంద్ర చౌదరిని నమిత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..  

Leave a Comment