పెళ్లిలో డీజే, బారత్ లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేయాల్సిందే..!

ఈరోజుల్లో పెళ్లంటేనే భారీ ఖర్చుతో కూడుకున్న పని.. అర్భాటాలకు వెళ్లి తాహతుకు మించి ఖర్చు చేస్తున్నారు. అలంకరణలు, సంగీత కార్యక్రమాలు, ఇతర సంప్రదాయాల పేరిట అనవసరంగా ఖర్చు చేస్తున్నారు. దీంతో వారు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈనేపథ్యంలో రాజస్థాన్ పాలిలోని రెండు సామాజిక వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి..

వివాహ వేడుకల్లో విందు భోజనాలు, తాహతుకు మించి ఆడంబరాలు, అలంకరణలకు స్వస్తి చెప్పాలని కుమావత్, జాట్ సామాజిక వర్గాల నేతలు నిర్ణయించారు. పెళ్లిళ్లకు తక్కువ ఖర్చు చేయాలని ఒప్పందం చేసుకున్నారు. భారీగా అలంకరణ, డీజే, బాణాసంచా కాల్చకూడదని, పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగుతూ రాకూడదని కట్టుబాటు విధించారు. 

అంతేకాదు.. వధూవరులకు బంధువులు కానుకగా ఇచ్చే నగదు, దుస్తులు, నగలు తదితరాలపై కూడా పరిమితి పెట్టారు. పెళ్లిలో వరుడు గడ్డం పెంచకుని ఉండకూడదని రూల్ పెట్టారు. వీటిని తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే జరిమానా లేదా ఇతర శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. 

 

   

 

Leave a Comment