భార్యకు గిఫ్ట్ గా చంద్రుడిపై స్థలం..!

భార్యకు ప్రేమగా కానుకలు ఇవ్వడం సహజం.. భర్తలు తమ స్థాయిని బట్టి భార్యకు గిఫ్ట్ ఇస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్య కోసం ఏకంగా చంద్రుడిపై స్థలాన్ని కోనుగోలు చేసి ఇచ్చాడు.. మధ్యప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాకు చెందిన హరీశ్ మహాజన్ అనే వ్యక్తి తన భార్యకు చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చాడు.. 

వాస్తవానికి గతేడాదే చంద్రుడిపై స్థలం కొనుగోలు చేయాలని ఆయన భావించారు. అందుకోసం ఇంటర్నేషనల్ లునార్ ల్యాండ్స్ సొసైటీకి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది తర్వాత రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పత్రాలను ఆన్ లైన్ లో పంపించారు. అయితే ఇందుకోసం ఎంత డబ్బులు చెల్లించిందీ మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇది ప్రేమకు సంబంధించిన విషయమని, డబ్బుది కాదని ఆయన చెప్పుకొచ్చారు.  

Leave a Comment