వైఎస్సార్ చేయూత కొత్త రూల్స్ ఇవే..

అక్కా చెల్లెమ్మలకు ఆసరా కోసం ప్రకటించిన YSR Cheyutha పథకానికి లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నాగులేళ్ల పాటు ఏటా రూ.18,750 వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఆగస్టు 12న YSR Cheyutha పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఈనెల 25 నుంచి జులై 2 తేదీల మధ్య లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ/వార్డు వలంటీర్లు ఇంటింటి సర్వే చేస్తారు.  ఈ పథకానికి సంబంధించి అర్హతలేంటీ, ఏ సర్టిఫికెట్లు అవసరమనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

YSR Cheyutha కోసం అవసరమైన సర్టిఫికెట్లు..

  • కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. 
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉండాలి. 
  • బ్యాంకు అకౌంట్ 
  • ఆధార్ కార్డు
  • వయస్సు నిర్ధారణకు ఆధార్, రేషన్ కార్డులను పరిశీలిస్తారు. 

YSR Cheyutha పథకానికి అర్హతలు..

  • YSR Cheyutha కేవలం మహిళలకు మాత్రమే సంబంధించిన పథకం.
  • 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు మాత్రమే అర్హులు.
  • వీరిలో వైఎస్సార్ పెన్షన్ కానుక తీసుకుంటున్న వారు అనర్హులు.
  • కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీన ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఉండాలి. 
  • తడి భూమి మూడు ఎకరాలు, మెట్ట ఏడు ఎకరాలు, మొత్తం పది ఎకరాల్లోపు ఉండాలి. 
  • పట్టణాల్లో 1000 చదరపు అడుగుల ఇంటి స్థలం ఉండకూడదు.
  • కరెంటు బిల్లు 300 యూనిట్లలోపు ఉండాలి.
  • ఇంట్లో ఎవరూ ఇంకమ్ ట్యాక్స్ పే చేయకూడదు.
  • ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు.
  • నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు. అయితే ట్రక్టర్, క్యాబ్, మ్యాక్సీ ఉండవచ్చు. 
  • వితంతు లేదా ఒంటరి మహిళ కింద పెన్షన్ తీసుకుంటున్న వారు అనర్హులు.
  • భర్త పెన్షన్ తీసుకున్నట్లయితే భార్య 60 ఏళ్లకు తక్కువ వయస్సు ఉంటే పథకం వర్తిస్తుంది. 
  • భర్త వృధ్యాప్య లేదా వికలాంగ పెన్షన్ తో భార్యకు సంబంధం లేదు. కానీ భర్త రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటే ఆమె అనర్హులు.
  • ఒక మహిళ పిల్లులు లేదా తల్లదండ్రులు పెన్షన్ తీసుకుంటున్నా ఆమె అర్హురాలే. 

రేపటి నుంచి సర్వే..

  • జూన్ 25 నుంచి జులై 2వ తేదీ మధ్య అర్హులైన మహిళలకు వలంటీర్లు ఇంటింటా సర్వే ప్రారంభిస్తారు. 
  • జులై 3 నుంచి జులై 9 తేదీల మధ్య అర్హుల, అనర్హుల జాబితాలను ప్రకటించి సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. 
  • జులై 10 నుంచి జులై 20 తేదీల మధ్య మండల స్థాయిలో ఎంపీడీఓ, మున్సిపాలిటీల్లో కమిషనర్లు అర్హుల తుది జాబితాను ప్రకటిస్తారు. 
  • ఆగస్టు 12వ తేదీన YSR Cheyutha పథకాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. 
  • అర్హులైన మహిళల ఖాతాల్లో రూ.18,750 జమ చేస్తారు. 

Leave a Comment