జాగ్రత్త : ఆ మెయిల్స్ వస్తే ఓపెన్ చేయొద్దు..

కరోనా టెస్టులు ఉచితంగా చేయిస్తామని మెయిల్ వస్తే దానిని క్లిక్ చేయవద్దని కేంద్రప్రభుత్వం హెచ్చరించింది. ఇలాంటి మెయిల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) సూచించింది. సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ అటాక్ నిర్వహించే అవకాశం ఉందని తెలిపింది. [email protected] పేరుతో ఈమెయిల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. పొరపాటున క్లిక్ చేస్తే కష్టాలు తప్పవని చెప్పింది. 

ఇలాంటి మెయిల్స్ ను క్లిక్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు తమ వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇలాంటి మెయిల్స్ ను తెరవకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

గత కొన్ని రోజులుగా ఈ ఫేక్ మెయిల్స్ వస్తున్నాయని, వీటి వల్ల వ్యక్తుల మరియు వ్యాపారాలపై పెద్ద ఎత్తున సైబర్ దాడి జరిగే ప్రమాదం ఉందని సీఈఆర్టీ హెచ్చరించింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ ప్రజలు ఉచిత కోవిడ్-19 పరీక్షలు అని వచ్చే మెయిల్స్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సైబర్ నేరగాళ్లు కొత్త, కొత్త మార్గాలతో దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అపరిచిత మెయిల్స్, మెసేజ్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఈఆర్టీ హెచ్చరించింది.

Leave a Comment