పాకిస్థాన్ కంటే చైనాయే ప్రమాదకరం..

భారత దేశానికి మన దయాది దేశం పాకిస్థాన్ కంటే చైనానే ప్రమాదకరమని భారతదేశంలోని అధిక శాతం మంది అభిప్రాయపడ్డారు. చైనాతో కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సీఓటర్ నిర్వహించిన సర్వే ప్రకారం, 68 శాతం భారతీయులు ఇండియాకు చైనానే ప్రమాదకరమన్నారు. అయితే 32 శాతం మంది మాత్రం పాకిస్థాన్ ప్రమాదకరమని వెల్లడించారు. ఇక సరిహద్దు వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకముందని 73 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 17 శాతం మంది ప్రతిపక్షాల పై నమ్మకం ఉందన్నారు. 

జాతీయ భద్రత విషయంలోనూ 73 శాతం మంది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నమ్మారు. అయితే రాహుల్ గాంధీని కేవలం 14 శాతం మంత్రి మాత్రమే నమ్మకం ఉంచారు. ఇక 68 శాతం మంది చైనా వస్తువులను బహిష్కరిస్తామని, 31 శాతం చైనా వస్తువులను కొనడంలో అభ్యంతరం లేదని వెల్లడించారు. ఇక సరిహద్దు వివాదంలో భారతదేశం చైనాకు గట్టి జవాబు ఇవ్వలేదని 60 శాతం మంది అభిప్రాయపడ్దారు. 

 

Leave a Comment