ఏపీలో మరన్ని సడలింపులు..ప్రార్థన మందిరాలు, మాల్స్, హోటల్స్ కు కొత్త మార్గదర్శకాలు..

అన్ లాక్ 1.0 లో కేంద్ర ప్రభుత్వం చాలా వరకు సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి రాష్ట్రలో ప్రార్థన మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనలను నిబంధనలు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కొత్త రూల్స్ ఇవే..

  • ప్రార్థనా మందిరాలు, ఆలయాల్లో రద్దీ కాకుండా  ఉండేలా భక్తులు వచ్చేందుకు, వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలి. 
  • ప్రవేశ మార్గాల వద్ద కచ్చితంగా హ్యాండ్ శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ అందుబాటులో ఉండాలి. 
  • ప్రార్థనా మందిరాల్లో భక్తులను దశల వారీగా పంపించాలి.
  •  క్యూలైన్లలో 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. 
  • ప్రార్థన మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లోకి వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. 
  • ప్రార్థన మందిరాల్లో తీర్థప్రసాదాలు ఇవ్వడం, భక్తి గీతాలు ఆలపించడం, పవిత్ర జలం చల్లడం వంటివి చేయకూడదు. విగ్రహాలు, పవిత్ర గంథాలను తాకకుండా చూడాలి. 

 

Leave a Comment