సరికొత్తగా ఇండస్ట్రియల్ పాలసీ విడుదల..!

ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “పారిశ్రామికాభివృద్ధి విధానం 2020-23” ను పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి,  ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా లాంఛనంగా ఆవిష్కరించారు. పారిశ్రామిక వేత్తలుగా మహిళలు ఎదిగేందుకు, అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలు అభివృద్ధిని కాంక్షించేలా కొత్త ఇండస్ట్రియల్ పాలసీ సరికొత్తగా రూపొందించబడింది. పారిశ్రామిక, విద్యా, ఆర్థిక, వాణిజ్య వేత్తల సమక్షంలో మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం వేదికగా సోమవారం కొత్త పారిశ్రామిక విధానం విడుదలైంది.

అన్ని ప్రాంతాల, సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం నిర్దేశించుకున్న కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం సమానవృద్ధికి దిక్సూచిగా మారనుంది.  పారిశ్రామిక ప్రపంచంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అండగా ఉండనుంది. పారిశ్రామికరంగంలో కీలకమైన ఔషధ, జౌళి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, పెట్రో కెమికల్ రంగాలతో పాటు పలు కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ 2020-23  భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా నిలబెట్టనుంది. వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనుంది. రాష్ట్రాభివృద్ధికి మూలాధారమైన ‘రెడీ-బిల్ట్ ప్రీ-క్లియర్డ్’ సదుపాయాలను సృష్టించడం, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను అందించడంపై దృష్టి పెట్టనుంది.

 

Leave a Comment