ఓటర్ ఐడీ ఒకటే చాలు..

పౌరసత్వం రుజువుపై ముంబై కోర్టు

భారత పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే చాలని ముంబై మెట్రోపాలిటన్ కోర్టు శక్రవారం తెలిపింది. ఇటీవల ఇద్దరు వ్యక్తులను బంగ్లాదేశ్ చొరుబాటుదారులుగా పోలీసులు కోర్టు ఎదుట ప్రవేవపెట్టిన కేసులో కోర్టు ఈ మేరకు స్పందించింది. పాస్ పోర్టు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్బాస్ షేక్, ఆయన భార్య రాబియా ఖాతూన్ షేక్ లను ఈనెల 11న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఏహెచ్ కాషికర్ నిర్దోషులుగా ప్రకటించారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటివి పౌరసత్వానికి రుజువు చేసుకునేందుకు సరిపోకపోతే ఓటర్ కార్డు ద్వారా తాము భారతీయులమని నిరూపించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

అబ్బాస్ షేక్ తనతో పాటు తన భార్యకు చెందిన ఆధార్, పాన్ కార్డులతో పాటు ఓటర్ గుర్తింపు కార్డు, పాస్  పుస్తకం, ఆరోగ్య కార్డు, రేషన్ కార్డులను సమర్పించారు. ప్రభుత్వ అధికారులు జారీ చేసిన ఈ పత్రాలన్నీ రుజువులుగా సరిపోతాయని కోర్టు పేర్కొంది. అదే సమయంలో ఇవన్నీ కూడా పౌరసత్వాన్ని రుజువు చేసే ఉద్దేశంతో జారీ చేసినవి కాదు గునుక వీటిని సరిపడ ఆధారాలుగా పరిగణించడం కుదరదని వ్యాఖ్యానించింది. అయితే, ఫొటోతో కూడి ఓటర్ గుర్తింపు కార్డు ద్వారా సదరు వ్యక్తి శిక్షార్హుడవుతాడు కాబట్టి అతనిని భారతీయుడేనని నిర్ధారించేందుకు ఓటర్ కార్డు సరిపోతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే నిందితులను నిర్దోషులుగా తేల్చారు. అయితే, ఓటర్ ఫొటో గుర్తిపంు కార్డుగానీ, పాన్ కార్డుగానీ, బ్యాంకు పత్రాలుగానీ భూమి పన్ను చెల్లింపు రసీదులుగానీ ఓ వ్యక్తిని భారతీయ పౌరుడిగా నిర్ధారించేందుకు సరిపోవని గువహతి హైకోర్టు ఈనెల12న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Leave a Comment