భారత్ లో నిరుద్యోగం తగ్గుతోందట.. నిజమేనా?

భారతదేశంలో నిరుద్యోగం క్రమంగా తగ్గుతోందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా సాధారణ స్థితికి రావడంతో దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గుతోందని తెలిపింది. ఫిబ్రవరిలో 8.10 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు మార్చి నాటికి 7.6 శాతానికి తగ్గిందని, ఏప్రిల్ 2 నాటికి అది మరింత తగ్గి 7.2 శాతానికి పడిపోయిందని పేర్కొంది. పట్టణ నిరుద్యోగ రేటు 8.5 శాతంగా.. గ్రామీణ ప్రాంతాల్లో 7.1 శాతంగా ఉందని వెల్లడించింది. 

నిరుద్యోగ రేటు తగ్గుతున్నప్పటికీ భారతదేశం వంటి పేద దేశానికి ఇది ఇంకా ఎక్కువగానే ఉందని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ అభిరూప్ సర్కార్ తెలిపారు. రెండేళ్లుగా కోవిడ్ -19 తర్వాత ఆర్థిక వ్యవస్థ మళ్లీ ట్రాక్ లోకి వస్తోందని అన్నారు. ఉపాధి లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో జీవనం దుర్భరంగా మారిందని తెలిపారు. 

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా ప్రకారం.. మార్చిలో హర్యానాలో అత్యధికంగా 26.7 శాతం, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ లో నిరుద్యోగం 25 శాతంగా ఉంది. బీహార్ 14.4, త్రిపుర 14.1, పశ్చిమ బెంగాల్ 5.6 శాతాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా కర్ణాటక, గుజరాత్ లో 1.8 శాతం నిరుద్యోగ రేటు ఉంది. మరీ ఈ గణాంకాల ప్రకారం నిరుద్యోగ రేటు తగ్గుతుంది. మరీ మీ గణాంకాల ప్రకారం నిరుద్యోగం ఏస్థాయిలో ఉందో కామెంట్ చేయండి..  

 

Leave a Comment