‘సంక్రాంతిలోపు ఏపీకి కొత్త ముఖ్యమంత్రి’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భోగి పండుగలోపు నూతన ముఖ్యమంత్రి రాబోతున్నారని జోస్యం చెప్పారు. శనివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు.

ఏపీలో పేదలకు అందిస్తున్న బియ్యంలో 50 శాతం ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. సీఎం కుర్చీ పోతుందన్న దిగులుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయటకు రావడం లేదన్నారు. సంక్రాంతి పండుగలోపు రాష్ట్రంలో సీఎం మారిపోతారని చెప్పారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని, అది కాంగ్రెస్ వల్లే సాధ్యం అవుతుందని వ్యాఖ్యానించారు. దీపావళిలోపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు ప్రతినిధిగా నియమితులవుతారని తెలిపారు.  

 

Leave a Comment