టెలీమెడిసిన్ కోసం కొత్త బైకులు : సీఎం జగన్

టెలీమెడిసిన్ కోసం కొత్త బైకులు కొనుగోలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ -19 నివారణ చర్యలపై బుధవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. 

ఎమర్జెన్సీ సేవలను ఏ లోటూ లేకుండా చూడాలని తెలిపారు. గర్భిణులు, కీమోథెరఫీ, డయాలసిస్‌ వంటి ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారందర్నీ గుర్తించామని, షెడ్యూలు ప్రకారం వారికి వైద్య సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలన్నింటినీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించామని వెల్లడించారు.

చేపలు, రొయ్యలకు స్థానికంగా మార్కెటింగ్‌..

చేపలు, రొయ్యలను రాష్ట్రంలో స్థానికంగా విక్రయించేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీని కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలన్నారు. దీనిపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. 

పండ్ల ఉత్పత్తులపై సమీక్ష..

రాయలసీమ తదితర జిల్లాలలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, టమోటాలకు మరింత మార్కెట్‌ ఉందన్నారు. కోల్డ్‌ స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, గోదాముల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.

 

Leave a Comment