ఎంఎస్ఎంఈలకు రూ.3లక్షల కోట్ల భారీ ప్యాకేజీ..

భారతదేశం స్వయం సమృద్ధిగా ఎదగడానికి ప్రధాని మోడీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి వెల్లడించారు. అందరు మంత్రలతో చర్చించాకే ఈ ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. ఈ ప్యాకేజీ దేశ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. భారత్ స్వయం సమృద్ధిగా ఎదగడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందన్నారు. 

ఐదు మూల స్తంభాల ఆధారంగా ఈ ప్యాకేజీ రూపొందించాలరని, స్వదేశీ బ్రాండ్లను తయారు చేయడమే దీని ఉద్దేశ్యమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు పేరు రావాలన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం రూపొందించిన అన్ని పథకాలు ఇప్పుడు మంచి ఫలితాలనిస్తున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. పేదల బ్యాంక్ అకౌంట్లలో నేరు నగదు బదిలీ చేశామన్నారు. గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ ద్వారా ఆర్థిక ఉద్దీపన అమలు చేశామన్నారు. 

పదిహేను రకాల ఉద్దీపన పథకాలను నేడు ప్రకటిస్తున్నామన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వ గ్యారంటీతో మూడు లక్షల కోట్ల రూపాయాలు అప్పులు ఇస్తామన్నారు. అక్టోబరు 31 వరకు ఎంఎస్ఎంఈలు ఈ పథకం ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందని స్ఫష్టం చేశారు. 

కొన్ని ముఖ్యమైన పాయింట్లు..

  • 45 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట
  • రూ.3లక్షల కోట్ల రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీ
  • చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అక్టోబరు 31 వరకు అప్పులు
  • అత్యవసరాల కోసం చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.20వేల కోట్ల అప్పులు
  • 4 సంత్సరాల కాలపరిమితికి అప్పులు తీసుకోవచ్చు. 
  • విద్యుత్ డిస్కంలను ఆదుకునేందుకు రూ.90వేల కోట్ల నిధులు
  • ఈపీఎఫ్ ప్రభుత్వమిస్తున్న సాయం మరో 3 నెలల పాటు పొడిగింపు
  • 70.22 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి.
  • ప్రాథమిక, సెంకడరీ మార్కెట్లలో పెట్టుబడులపై రూ.30వేల కోట్లు
  • నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లను ఆదుకునేందుకు రూ.30వేల కోట్లు
  • ప్రభుత్వ రంగ సంస్థలు ఇవ్వాల్సిన బాకీలను తీరస్తాం.
  • కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోని కాంట్రాక్టులన్నీ 6 నెలల వరకు పొడిగింపు
  • కరోనాతో వాయిదపడిన రియల్ ఎస్టేట్ నిర్మానాల కాలపరిమితి 6 నెలల వరకు పొడిగింపు
  • రేపటి నుంచి 2021 నాటికి చెల్లించాల్సిన టీడీఎస్, టీసీఎస్ 25 శాతం తగ్గింపు
  • ట్యాక్స్ రిటర్న్ తేదీ 31 జులై నుంచి నవంబంర్ 31 వరకు పొడిగింపు
  • ‘వివాద్ సే విశ్వాస్’ పథకం కాలాన్ని అదనపు చెల్లింపులు లేకుండా డిసెంబర్ 31 వరకు పొడిగింపు.
  • రూ.200 కోట్ల వరకు గ్లోబల్ టెండర్లు పిలవం.

Leave a Comment