మానవత్వం చాటిన ప్రకాశం జిల్లా పోలీసులు

కష్టకాలంలో ఉన్న ఒక కానిస్టేబుల్ కు ఆపన్న హస్తం అందించారు ప్రకాశం జిల్లా పోలీసులు. తమ సహచరుడిని కష్ట సమయంలో ఆదుకున్నారు. 

ప్రకాశంజిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని టూ టౌన్ పోలీస్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న కె. అంకయ్య భార్య ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. ముగ్గురు శిశువులు 7  వ నెలలో జన్మించడం వల్ల వారికీ పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేయాలని డాక్టర్లు సూచించారు.  వైద్యం కోసం రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుంది.  శిశువుల చికిత్స అత్యంత ఖరీదయినందున సదరు  కానిస్టేబుల్  ఖర్చులు  భరించలేని  స్థితిలో  ఉన్నాడు. 

విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మానవతా దృక్పథంలో స్పందించారు. కానిస్టేబుల్ అంకయ్యకు ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడాలని జిల్లా పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు. పోలీస్ బాస్ ఇచ్చిన పిలుపు మేరకు  వెంటనే స్పందించిన ప్రకాశం జిల్లా పోలీసు సిబ్బంది తోటి సహచరుడికి కష్ట సమయంలో మద్దతుగా నిలిచారు. రూ.10 లక్షల నిధులను సేకరించి కానిస్టేబుల్ కు అందజేశారు. 

 

Leave a Comment