ఉమెన్ క్రికెటర్ పెళ్లి ఫొటో షూట్ పై నెటిజన్లు ఫిదా..!

పెళ్లయితే చాలు ఫొటో షూట్ పెట్టుకోవాల్సిందే.. ఇటీవల వెడ్డింగ్ ఫొటో షూట్ అనేది కామన్ అయిపోయింది. అయితే కొందరు మాత్రం తమ వెడ్డింగ్ పొటో షూట్ డిఫరెంట్ గా ఉండాలని కోరుకుంటారు. ఈ కోవలోకే ఓ ఉమెన్ క్రికెటర్ చేరింది. తన పెళ్లి ఫొటో షూట్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. చీర కట్టుతో, ఒంటినిండా నగలతో గ్రౌండ్ లో బ్యాటింగ్ చేస్తూ ఫొటో షూట్ చేయించుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు ఈ ఫొటోలు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)ని కూడా ఆకర్షించాయి. క్రికెటర్ల వివాహ ఫొటోలు ఇలానే ఉంటాయని కామెంట్ పెట్టింది. 

బంగ్లాదేశ్ అంతర్జాతీయ మహిళ క్రికెటర్ సంజిదా ఇస్లామ్(24) ఇటీవల రంగాపూర్ కు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మిమ్ మొసాద్ డిక్ ను పెళ్లి చేసుకుంది. క్రికెట్ పై ఉన్న ప్రేమతో బ్యాట్ పట్టుకుని ఫొటో షూట్ చేసుకుంది. పెళ్లి కూతురు ముస్తాబులోనే బ్యాట్ పట్టి కవర్ డ్రైవ్, ఫుల్ షాట్స్ ఫోజులతో అదరగొట్టింది. ఈ ఫొటోలు వైరల్ కాగా, కొంత మంది నెటిజన్లు ప్రశంసించగా, మరి కొందరు నెగిటివ్ కామెంట్లు చేశారు. అయితే వాటిని సంజిదా లైట్ గా తీసుకున్నారు. 

 

Leave a Comment