‘ఆర్ఆర్ఆర్’ నుంచి కొమరం భీమ్ టీజర్ రిలీజ్..!

‘వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయ్.. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ.. నా తమ్ముడు గోండు బెబ్బులి..కొమురం భీం’ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ పాత్రను రామ్ చరణ్ పరిచయం చేశాడు. ఎన్టీఆర్ అభిమానులు పండుగ చేసుకునేలా టీజర్ రూపొందించారు.  ఈ టీజర్ లో ఎన్టీఆర్ యాక్షన్స్ కి రామ్ చరణ్ వాయిస్ ఇచ్చాడు. ఎంతగానో ఎదురు చేస్తున్న అభిమానుల అంచనాలకు తగ్గకుండా టీజర్ లో భీమ్ గా ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఇక రామ్ చరణ్ ఇచ్చిన వాయిస్ కూడా గంభీరంగా ఉంది.  

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవ్ గన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

Leave a Comment