Neeraj Chopra Workouts Video: నీరజ్ చోప్రా అదిరిపోయే విన్యాసాలు.. వీడియో వైరల్..!

టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో ఫైనల్ లో అద్భుత ప్రదర్శనలతో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ఇప్పుడు ఒక సంచలనం.. అత్యంత దూరం జావెలిన్ విసిరి దేశం సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. అయితే నీరజ్ చోప్రాకు పసిడి పతకం ఆశామాషీగా రాలేదు. దీని వెనుక కఠోర శ్రమ దాగుంది.  

కాగా నీరజ్ చోప్రా సాధన చేసే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీరజ్ తన చేతిలో ఓ వస్తువును పట్టుకొని శరీరాన్ని పూర్తిగా విల్లులాగా వంచడం, తర్వాత అలాగే పైకి లేవడం కనిపిస్తుంది. జావెలిన్ త్రోలో గెలువడం కోసం హార్డిల్స్ క్రీడాకారిడిగా, వెయిట్ లిఫ్టర్ గా, బాడీ బిల్డర్ గా ఇలా ఎన్నో అవతారాలెత్తాడు. అత్యంత కఠినమైన ‘డ్రాగన్ ఫ్లాగ్’ చేశాడు. గాలిలో ఎగిరి రెండు కాళ్లను 90 డిగ్రీల్లో ఉంచడమే ‘డ్రాగన్ ఫ్లాగ్’. దీనిని సాధించాలంటే ఎంతో కఠినమైన సాధన చేయాల్సి ఉంటుంది.  

Leave a Comment