ప్రేయసి కోసం 21 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు..!

ప్రేమ అనేది ఒక గొప్ప అనుభూతి.. అది ఆస్వాదించే వారికే తెలుస్తోంది. చూసేవారికి కాదు. కొందరు ప్రేమ కోసం దేనికైనా సిద్ధపడుతుంటారు. మరి కొందరు ప్రాణాలు తీసుకుంటారు. ప్రేమ కోసం ఎన్ని ఏళ్లయినా ఎదురుచూసేవారు ఉన్నారు.. 

తమిళనాడులోని పుదుకోట్టయిలో ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఒకటి రెండేళ్లు కాదు ఏకంగా 21 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. జిల్లాలోని పొన్నమరావతి సమీపంలోని మూలక్కుడి గ్రామానికి చెందిన నాగరాజన్(40) 21 ఏళ్ల క్రితం ఉపాధి కోసం కేరళకు వెళ్లాడు. 

అక్కడ నాగరాజన్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. తన తోబుట్టువులకు పెళ్లి అయ్యాక వివాహం చేసుకుందామని చెప్పి ఆమెను మూలక్కుడికి తీసుకొచ్చాడు. అయితే ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులకు తెలిసింది. వారు వచ్చి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. 

ఈ ఘటనతో నాగరాజన్ షాక్ గురయ్యాడు. తన ప్రేయసి ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆ పరిసరాల్లోనే రోడ్డు మీద తిరుగుతూ ఆశగా ఎదురుచూసేవాడు. ఈక్రమంలో ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోయేవాడు. దీంతో అతడు మతిస్థిమితం కోల్పోయాడు. అలా ఏళ్లుగా నిరీక్షిస్తున్న అతడి విషయం ఇటీవల జిల్లా అధికారులకు తెలిసింది. దీంతో వారు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సాయంతో అతడినిి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.  

 

Leave a Comment