టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి సర్ణం..!

టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్ లో భాగంగా అత్యధిక దూరం విసిరి భారత్ కు సర్ణ పతకం అందించాడు. జావెలిన్ ను అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి టాప్ లో నిలిచాడు. దీంతో అథ్లెలిక్స్ లో పతకం కోసం ఎదురు చూస్తోన్న భారత్ 100 ఏళ్ల కల నేడు సాకారమైంది. 

తొలి ప్రయత్నంలో 87.03 మీటర్ల దూరం విసిరి టాప్ లో నిలిచిన నీరజ్ రెండో అటెంప్ట్ తో మరింత పదునుగా త్రో చేశాడు. సెకండ్ అటెంప్ట్ లో 87.58 మీటర్ల దూరం విసిరి బెస్ట్ నమోదు చేశాడు. ఆ తర్వాత మూడో రౌండ్ లో 76.79 మీటర్లు విసిరినప్పటికీ తొలి రెండు రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో తొలి స్థానంలో కొనసాగాడు. అయితే నాలుగు, ఐదో రౌండ్లలో ఫౌల్ చేశాడు. ఆరో రౌండ్ లో 84.24తో ముగించాడు. ఓవరాల్ గా 87.58 తో సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకున్నాడు. ఈ పతకంతో టోక్యో ఒలింపిక్స్ లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 7కు చేరుకుంది. 

 

 

Leave a Comment