ఆర్డరిస్తే షాపుకెళ్లి వస్తువులు తెచ్చేస్తుంది.. ఇది మామూలు కుక్క కాదు..!

కుక్కలు అత్యంత నమ్మకం గల జంతువు. కుక్కలతో ఒక్కసారి మచ్చిక చేసుకుంటే చాలా అవి అత్యంత నమ్మకంగా ఉంటాయి. అందుకే కుక్క విశ్వాసానికి మారు పేరుగా నిలుస్తూ మనతో మమేకమైపోతుంది. కుక్కలకు కొంచెం ట్రైనింగ్ ఇస్తే చాలా అవి ఎలాంటి పనులైన చేస్తాయి. 

తమిళనాడుకు చెందిన జాక్ స్పారో అనే శునకం స్వయంగా షాపింగ్ చేస్తుంది. తన యజమాని రాసిచ్చిన చిట్టిని తీసుకెళ్లి ఆ వస్తువులన్నింటిని జాగ్రత్తగా ఇంటికి తెస్తుంది. అంతేకాదు మిగిలిన చిల్లరను జాగ్రత్తగా తెచ్చి అప్పజెబుతుంది. 

జాక్ స్పారో తమిళనాడులోని దిండిగుల్ జిల్లా పళనిలోని దాస్ ఫెర్నాండెజ్ పెంపుడు కుక్క.. ఈ లాబ్రడార్ జాతి కుక్కకు నాలుగేళ్లు ఉంటాయి. ఈ కుక్కు చిన్నప్పటి నుంచే దుకాణానికి వెళ్లి వస్తువులు తీసుకురావడాన్ని యజమాని అలవాటు చేశారు. దాస్ ఇచ్చిన చిట్టితో దుకాణానికి వెళ్లి అక్కడ వారిచ్చే వస్తువులను ఇంటికి తీసుకొస్తుంది. జాక్ స్పారో షాపింగ్ ను స్థానికులతో పాటు బయటి ప్రాంతాల వారు ఆసక్తిగా తిలకిస్తుంటారు..

Leave a Comment