బుల్లెట్ పై లవర్స్ రొమాన్స్.. నడిరోడ్డుపై బరితెగించిన జంట..

బీహార్ లో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. సినిమాల్లో హీరోహీరోయిన్ల తరహాలో రొమాంటిక్ బైక్ డ్రైవ్ చేసింది.  బుల్లెట్ బైక్ పై ఇద్దరూ ముద్దులు హగ్గులతో రెచ్చిపోయారు.. ప్రియుడు బైక్ నడుపుతుండగా ప్రేయసి ఫ్యూయెల్ ట్యాంక్ పై అతడి వైపునకు తిరిగి కూర్చొని ముద్దుల వర్షం కురిపించింది. 

గయా జిల్లాలోని గ్రామీణ రోడ్డుపై ఓ జంట నడిరోడ్డుపై హల్ చల్ చేసింది. బెల్లెట్ మీద వెళ్తూ ప్రియుడు బైక్ నడుపుతుంటే, ప్రియురాలు బైక్ ట్యాంక్ పై అతడి వైపునకు తిరిగి కూర్చుని ఉంది. రోడ్డు కూడా చూడకుండా ముద్దులు పెట్టుకుంటూ హగ్ చేసుకుంటూ ఇద్దరూ రెచ్చిపోయారు. 

ఆ సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు చూసి బైక్ ను వెంబడించారు. పబ్లిక్ గా ఇలాంటి చెత్త పనులు చేయడం ఏంటని ఆ జంటను నిలదీశారు. దీంతో ఆ జంట గ్రామస్తులకు సారీ చెప్పి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

Leave a Comment